ఆస్తులు కూడబెడుతూపోతే చివరికి జరిగేది ఇదే: డైరెక్టర్ తేజ

  • కొత్త ఆర్టిస్టులతో ప్రయోగాలు చేసిన తేజ 
  • పిల్లలను ప్రయోజకులను చేయాలని వ్యాఖ్య 
  • వాళ్ల కోసం ఆస్తులు దాచకూడదని వెల్లడి 
   

తేజ .. తెలుగు తెరపై ప్రేమకథలను తనదైన స్టైల్లో పరిగెత్తించిన దర్శకుడు. ఒకానొక సమయంలో తేజ సినిమాలు యూత్ ను ఒక ఊపు ఊపేశాయి. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లను పరిచయం చేస్తూ, ఆడియన్స్ ను మెప్పించినవారాయన. తేజ చాలా ముక్కుసూటి మనిషి. తాను చెప్పదలచుకున్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేస్తారు. ఆ మధ్య సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"నేను నా సినిమాల విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు చూసి, అలా చేయడానికి చాలా ధైర్యం కావాలని అనుకుంటారు. కానీ నిజానికి నేను అది తెలియక తీసుకున్న నిర్ణయమై ఉండొచ్చు. సక్సెస్ సాధించడమంటే డబ్బు సంపాదించడం కాదు. మన ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూనే, మనకి నచ్చినట్టుగా మనం బ్రతకడం అనేది నా అభిప్రాయం. అలా ఉండటానికే నేను ప్రాధాన్యతనిస్తాను" అని అన్నారు. 

" చాలామంది తమ సంపాదనను పిల్లల కోసం దాచేస్తూ ఉంటారు. పిల్లలను ప్రయోజకులను చేయడానికి ట్రై చేయాలేగానీ, ఆస్తులను ఇచ్చి బద్ధకస్తులను చేయడం తప్పనేది నా ఉద్దేశం. తమ పిల్లలు పనికిరారు .. పైకి రారు అని భావించిన వాళ్లు మాత్రమే ఆస్తులను దాస్తున్నారు. తేనె టీగలు తేనె దాస్తూ వెళతాయి. ఫైనల్ గా మనం వెళ్లి మంటపెట్టి వాటిని తరిమేసి మనం తాగుతాం. ఆస్తులు దాస్తూ వెళ్లడం వలన జరిగేది ఇదే" అని చెప్పారు. 


Teja
Director Teja
Telugu Cinema
Tollywood
Movie Director
Interview
Success
Assets
Property
Family

More Telugu News